Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉల్ఫా నేత పరేశ్ బారువాకు మరణ శిక్ష

ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఉల్ఫా నేత పరేశ్ బారువాకు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో మరో 13 మందికి కూడా మరణశిక్ష అమలు చేయాలని హైకోర్టు డివిజన్ అనుమతితో కోర్టు ఆదేశించింది. మరణశిక్ష పడ్డవారిలో జమాత్ చీఫ్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మోతీర్ రెహమాన్ నిజామీ, హోం మంత్రి లత్పోజమాన్ బాబర్ లు ఉన్నారు.

2014లో పది ట్రక్కులతో ఆయుధాలను అక్రమంగా తరలిస్తుండగా చిట్టగాంగ్ లో కర్నపులి నది వద్ద పట్టుకుని.... 4,930 అత్యాధునిక ఆయుధాలు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లు, 27,020 గ్రెనేడ్లు, 2 వేల గ్రెనేడ్ లాంచింగ్ ట్యూబ్ లు, 6,392 మ్యాగజీన్లు, 11.41 మిలియన్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం బంగ్లాదేశ్ చరిత్రలోనే తొలిసారి. ఈ కేసులో ప్రధాన నిందితులైన బారువా, మాజీ పరిశ్రమల కార్యదర్శి నురుల్ అమీన్ లు ఇప్పటి వరకు పోలీసులకు పట్టుబడకుండా అజ్ఞాతంలో ఉన్నారు.

More Telugu News